Covishield: 12-16 వారాల తర్వాతే రెండో డోసు
close

తాజా వార్తలు

Published : 13/05/2021 17:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covishield: 12-16 వారాల తర్వాతే రెండో డోసు

దిల్లీ: ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచొచ్చన్న నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించింది. అయితే దేశంలో అందుబాటులో ఉన్న మరో టీకా కొవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య అంతరంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 

డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల వ్యాక్సిన్‌తో మెరుగైన ఫలితాలు లభిస్తాయని నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ నిపుణుల బృందం నేడు సిఫార్సులు చేసింది. అంతకుముందు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది లాన్సెట్‌ కూడా కొవిషీల్డ్‌పై ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. రెండో డోసును 12 నుంచి అంతకంటే ఎక్కువ వారాలకు పెంచడం వల్ల ఈ టీకా 81.3శాతం సమర్థంగా పనిచేస్తుందని ఆ కథనంలో పేర్కొంది. అదే ఆరు వారాల వ్యవధిలో ఇస్తే టీకా సమర్థత కేవలం 55.1శాతంగానే ఉందని అధ్యయనకారులు గుర్తించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం టీకా డోసుల అంతరంలో మార్పులు చేసింది.

కాగా.. కొవిషీల్డ్‌ డోసుల మధ్య గడువు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ టీకాతో మెరుగైన ఫలితాలు పొందేందుకు వ్యవధిని 28 రోజుల నుంచి 6-8 వారాలకు పెంచుతూ ఈ ఏడాది మార్చిలో నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇప్పుడు 12-16 వారాలకు పెంచింది. అయితే వ్యాక్సిన్ల కోసం డిమాండ్‌ పెరుగుతున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని