రెండేళ్ల జీతాన్ని విరాళంగా ప్రకటించిన గంభీర్

తాజా వార్తలు

Published : 02/04/2020 13:10 IST

రెండేళ్ల జీతాన్ని విరాళంగా ప్రకటించిన గంభీర్

న్యూదిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకూ తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన ఉదారతను చాటుకున్నారు. కరోనాపై జరుగుతున్న పోరులో తమ వంతు సాయంగా రెండేళ్ల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

‘దేశం మనకోసం ఏం చేసింది? అని ప్రజలు అడుగుతున్నారు. కానీ, నిజమైన ప్రశ్న ఏంటంటే.. నీ దేశానికి నువ్వు ఏం చేశావు?’ నా వంతుగా రెండు సంవత్సరాల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నానని. మరి మీరు..?’ అని పీఎం మోదీ, జేపీ నడ్డా, భాజపా దిల్లీ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో జతచేసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడిబాధితుల సంఖ్య  1965కి చేరిందని.. వీరిలో 50 మంది మృతి చెందగా 1764 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని