అన్ని వ్యాధులు చైనా నుంచే..

తాజా వార్తలు

Published : 14/05/2020 01:13 IST

అన్ని వ్యాధులు చైనా నుంచే..

వాషింగ్టన్‌ : మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ చైనానుంచే వచ్చిందని గత 20 ఏళ్లలో ఐదు రకాల వైరస్‌లు ఆ దేశం నుంచే వచ్చాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఒబ్రయన్‌ తెలిపారు. వీటిని ప్రాధమికదశలోనే గుర్తించి కట్టడి చేయగలగిన సామర్థ్యం చైనాకు ఉందని ఆయన అన్నారు. అయితే చైనా అలా చేయకపోవడంతో తాజా కరోనా మహమ్మారితో 2,50,000 మందికి పైగా మృత్యువాత పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. 

చైనాను ప్రశ్నించాలి..

చైనాలోని మాంసపు మార్కెట్లు లేదా ప్రయోగశాలల నుంచి కరోనా వచ్చిందన్నది పక్కనపెడితే ఇలాంటి వ్యాధులను ప్రపంచం భరించే స్థితిలో లేదన్న అంశాన్ని బీజింగ్‌ గ్రహించాలన్నారు. గత 20 ఏళ్ల కాలంలో సార్స్‌, ఎవియన్‌ఫ్లూ, స్వైన్‌ఫ్లూ, కొవిడ్‌ 19 లాంటి భయంకరవ్యాధులు చైనాలో పుట్టాయని అయితే వాటిని అక్కడే నిలువరించడంలో ఆ దేశం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని ఆరోపించారు. దీనిపై  చైనాను నిలదీయాలన్నారు. కరోనా బయల్పడిన సమయంలో వైద్యసిబ్బందిని పంపిస్తామని తెలిపినప్పటికీ చైనా తిరస్కరించిన సంగతిని గుర్తుచేశారు. వుహాన్‌లోని ప్రయోగశాలలో ఈ వైరస్‌ జన్మించిందన్న అంశంపై ఇంకా పరిశోధనలు జరుపుతున్నామని తెలిపారు.  ప్రజారోగ్యంపై చైనా నిర్లక్ష్యం కారణంగానే  ప్రపంచం కరోనా కోరల్లో చిక్కుకుందని ఆయన ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని