పరీక్షల నిర్వహణకు కేంద్రం అనుమతి

తాజా వార్తలు

Updated : 20/05/2020 19:55 IST

పరీక్షల నిర్వహణకు కేంద్రం అనుమతి

దిల్లీ: దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఆయా పరీక్షలను నిర్వహించుకునేందుకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులు ఇస్తున్నట్లు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు. విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. భౌతిక దూరం పాటించడం, ఫేస్‌మాస్కులు ధరించడం తప్పనిసరి అని ట్వీట్‌ చేశారు.

సంబంధిత సడలింపులకు సంబంధించి హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. పరీక్షలకు నిర్వహణకు సంభందించి రాష్ట్రాలు, సీబీఎస్‌ఈ నుంచి వచ్చిన వినతులపై సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ కంటైన్‌మెంట్‌ జోన్లలో పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌, పరీక్ష కేంద్రాలను శానిటైజ్‌ చేయడం తప్పనిసరి అని సూచించారు. భౌతిక దూరం నిబంధనను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదన్నారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని