పరీక్షల నిర్వహణకు విద్యాసంస్థలకు అనుమతి

తాజా వార్తలు

Published : 06/07/2020 23:46 IST

పరీక్షల నిర్వహణకు విద్యాసంస్థలకు అనుమతి

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన తుది పరీక్షలను అన్ని కళాశాలలు, విద్యాసంస్థలు నిర్వహించుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు హోంశాఖ పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి, ఏప్రిల్ నెలల మధ్యలో నిర్వహించాల్సిన అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, హరియాణా వంటి పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసి అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్ధులను తర్వాతి తరగతులకు పంపాలని నిర్ణయించాయి. రాజస్థాన్‌ ప్రభుత్వం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేసింది.

ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మాత్రం పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపడంతో తాజాగా వాటికి అనుమతులిస్తూ హోంశాఖ ప్రకటన చేసింది. ఈ మేరకు యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆమోదించిన విధానం ప్రకారం తప్పనిసరియైన చివరి పరీక్షలను నిర్వహించవచ్చని లేఖలో పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌ కూడా ఏప్రిల్‌లో విడుదల చేసిన విద్యా క్యాలెండర్‌, మార్గదర్శకాలను పునఃసమీక్షించాలని యూజీసీని కోరారు. ఇందులో భాగంగా విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని