close

తాజా వార్తలు

Published : 25/11/2020 07:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అత్యాచారం చేస్తే నపుంసకులుగా మార్చేస్తారు!

పాక్‌లో నూతన చట్టానికి ఇమ్రాన్‌ ఖాన్‌ సూత్రప్రాయ అంగీకారం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో అత్యాచారాలను అరికట్టేందుకుగాను త్వరలోనే కఠిన చట్టం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యాచారానికి తెగబడినవారిని రసాయనాల సహాయంతో నపుంసకులుగా మార్చేందుకు వీలు కల్పించే నూతన చట్టానికి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మంగళవారం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. అత్యాచార నిరోధక ఆర్డినెన్సు పేరుతో న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదాను ఫెడరల్‌ కేబినెట్‌ సమావేశంలో ప్రవేశపెట్టినట్లు తెలిపింది. లైంగిక వేధింపుల కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా, సాక్ష్యులకు రక్షణ కల్పించేలా కూడా అందులో పటిష్ఠ నిబంధనలు చేర్చినట్లు పేర్కొంది. అయితే- ఈ ముసాయిదా విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని