కరోనా మార్గదర్శకాలు.. కేంద్రం ట్వీట్‌!

తాజా వార్తలు

Updated : 04/03/2021 22:38 IST

కరోనా మార్గదర్శకాలు.. కేంద్రం ట్వీట్‌!

దిల్లీ: దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. ఓ వైపు దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకెళ్తోంది. అయితే కొన్ని రోజులుగా కేసుల పెరుగుదలలో కాస్త హెచ్చుతగ్గులు కనిపించినా.. గడిచిన 24 గంటల్లో 17,407 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలు ఎక్కువగా సందర్శించే షాపింగ్‌మాల్స్‌, రెస్టారంట్‌లు, ప్రార్థనా మందిరాలలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ట్వీట్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కరోనా ముందు జాగ్రత్తలకు సంబంధించిన చిత్రాలను ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ఈ కొత్తగా ప్రకటించిన మార్గదర్శకాలు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. రద్దీ ఎక్కువగా ఉండే  ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వివరించింది. 
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని