దేశ భద్రతలో వారిద్దరి పాత్ర ఎంతో కీలకం: షా

తాజా వార్తలు

Updated : 12/11/2020 18:21 IST

దేశ భద్రతలో వారిద్దరి పాత్ర ఎంతో కీలకం: షా

గాంధీనగర్‌: సరిహద్దు గ్రామాల ప్రజలు, భద్రతా దళాలు దేశ రక్షణలో ప్రధాన వాటాదారులని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దేశాన్ని రక్షించడంలో వారిద్దరి పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.  గుజరాత్‌లో పాక్‌ సరిహద్దు వెంబడి ఉండే కచ్‌, భుజ్‌, బనస్కంత, పటన్‌ ప్రాంతాలను షా గురువారం సందర్శించారు. అనంతరం కచ్‌ జిల్లాలో నిర్వహించిన ‘వికాసోత్సవ 2020’ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం గ్రామస్థాయిలో అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందుకే బిహార్‌ సహా ఇతర రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తామంతా ప్రధాని నరేంద్రమోదీ వెంటే ఉన్నామని నిరూపించారు. ప్రజలకు మంచి జరిగే ప్రతివిషయంలోనూ తప్పుల్ని వెతికే నాయకుల్ని ప్రజలు తిరస్కరించారు’ అని షా తెలిపారు.

 అదేవిధంగా వికాసోత్సవ్‌ గురించి మాట్లాడుతూ.. ‘సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల్లో స్థైర్యాన్ని నింపడమే ఈ వికాసోత్సవ్‌ 2020 కార్యక్రమం లక్ష్యం. సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు, సైనికులే దేశ భద్రతలో ప్రధాన వాటాదారులు. వారు భద్రతాదళాలతో కలిసి దేశ రక్షణలో పాలుపంచుకుంటారు. భుజ్‌ ప్రాంతాన్ని నేను 2001లో భూకంపం సంభవించిన అనంతరం సందర్శించా. అప్పుడు ఈ ప్రాంతం ఎంతో అస్తవ్యస్తంగా ఉంది. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెద్దమొత్తంలో షాపింగ్ మాల్స్‌, ఇతర నివాస భవనాలు నిర్మాణమయ్యాయి. ఈ అభివృద్ధి భుజ్‌ ప్రజల స్థితిస్థాపకతకు నిదర్శనం’ అని షా వెల్లడించారు. అనంతరం షా అక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని