Vaccine: వ్యాక్సినేషన్‌లో కీలక మైలురాయి.. దేశంలో 75కోట్ల డోసుల పంపిణీ పూర్తి

తాజా వార్తలు

Published : 13/09/2021 18:42 IST

Vaccine: వ్యాక్సినేషన్‌లో కీలక మైలురాయి.. దేశంలో 75కోట్ల డోసుల పంపిణీ పూర్తి

దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో కీలక అస్త్రమైన వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ మరో కీలక మైలురాయిని దాటింది. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 75 కోట్ల డోసులకు పైగా పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఇదే రేటు కొనసాగితే డిసెంబర్‌ నాటికి 43శాతం దేశ ప్రజలకు వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ మంత్రం ప్రపంచంలోనే భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవం జరుపుకొంటున్న తరుణంలో 75 కోట్ల టీకా డోసులు పంపిణీ జరిగిందని పేర్కొన్నారు. 

మరోవైపు, కరోనా థర్డ్‌ వేవ్‌ను అడ్డుకోవాలంటే దేశంలో ఈ ఏడాది ఆఖరి నాటికి 60శాతం మంది ప్రజలకు రెండు డోసులూ పూర్తి చేయాలని కేంద్రం చూస్తోంది. అలా జరగాలంటే రోజుకు 1.2కోట్ల డోసులు పంపిణీ జరగాల్సి ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే.. గత ఏడు రోజుల్లో రోజుకు 7.7 మిలియన్ల చొప్పున టీకా డోసులు పంపిణీ జరిగింది. గడిచిన 24గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 5.3 మిలియన్ల డోసులు పంపిణీ చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని