బైడెన్‌కు ఇవాంకా ట్రంప్‌ శుభాకాంక్షలు

తాజా వార్తలు

Published : 20/01/2021 21:07 IST

బైడెన్‌కు ఇవాంకా ట్రంప్‌ శుభాకాంక్షలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌.. అధికారిక సలహాదారు హోదాలో దేశ‌ ప్రజలకు వీడ్కోలు సందేశాన్నిచ్చారు. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

ఈ మేరకు విడుదల చేసిన ఓ ట్విటర్‌ ప్రకటనలో.. అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, వారి సిబ్బందికి ప్రజాసేవకు సంసిద్ధులను చేసే శక్తి సామర్థ్యాలను ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని కోరుకుంటున్నట్టు ఇవాంకా తెలిపారు. అధ్యక్షుడి సలహాదారుగా వ్యవహరించటం తనకు జీవిత కాలంలో దక్కిన అపూర్వ గౌరవమని ఆమె పేర్కొన్నారు. తాను అమెరికన్‌ ప్రజల తరపున నిలిచి పోరాడేందుకే శ్వేత సౌధానికి వచ్చానని.. ఆ పనిలో విజయవంతమైనట్టే భావిస్తున్నానని 39ఏళ్ల ఇవాంకా తెలిపారు.

ఇదీ చదవండి..

ప్రమాణ స్వీకార విందు.. ఏమున్నాయంటే..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని