Parliament: హాకీ జట్టుకు పార్లమెంట్‌ అభినందనలు

తాజా వార్తలు

Published : 05/08/2021 14:00 IST

Parliament: హాకీ జట్టుకు పార్లమెంట్‌ అభినందనలు

దిల్లీ: 41 ఏళ్ల విరామానికి తెరదించుతూ హాకీ పురుషుల జుట్టు కాంస్య పతకాన్ని సాధించడంపై పార్లమెంట్‌లో అభినందనలు దక్కాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోపక్క పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం, రైతు చట్టాలు తదితర అంశాలపై పార్లమెంట్‌లో అదే గందరగోళం కొనసాగుతోంది. దాంతో మధ్యాహ్నం రెండు గంటలకు వరకు ఉభయ సభలు వాయిదాపడ్డాయి. 

 గురువారం ఉదయం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే విపక్షాలు నిరసనలు ప్రారంభించాయి. సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. వెల్ వద్దకు దూసుకొచ్చారు. ఈ తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధమని, ప్రజలు సభ నడవాలని కోరుకుంటున్నారని సభ్యులకు సూచించారు. అలాగే ఈ గందరగోళం కారణంగా కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలు అలాగే కొనసాగడంతో మధ్యాహ్నం రెండు వరకు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్కడ వాయిదాల పర్వం కొనసాగింది. నిన్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆరుగురు సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. జులై 19న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఇంతవరకూ ఒక్కరోజు కూడా సజావుగా సాగలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని