18 నెలలు.. 3.17 లక్షల సైబర్‌ నేరాలు!

తాజా వార్తలు

Published : 09/03/2021 20:10 IST

18 నెలలు.. 3.17 లక్షల సైబర్‌ నేరాలు!

లోక్‌సభలో కేంద్రం ప్రకటన

దిల్లీ: దేశంలో సైబర్‌ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 18 నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా 3,17,439 సైబర్‌ నేరఘటనలు చోటుచేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. 5771 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు తెలిపింది. వీటిలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సైబర్‌ నేర ఘటనలు గణనీయంగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. దేశంలోని అన్ని రకాల సైబర్‌ నేరఘటనలపై ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేసేలా పౌరులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2019 ఆగస్టు 30న  నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ను అమలులోకి తీసుకొచ్చిందన్నారు. ముఖ్యంగా, చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై కేంద్రం దృష్టి కేంద్రీకరించినట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలో 50,806 సైబర్‌ నేరఘటనలు , 534 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. కర్ణాటకలో 21,562 ఘటనలు, 87 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని