Corona: వైరస్‌ ముగిసిపోలేదు.. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది!

తాజా వార్తలు

Published : 10/10/2021 20:40 IST

Corona: వైరస్‌ ముగిసిపోలేదు.. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది!

హెచ్చరించిన ప్రముఖ వైరాలజిస్ట్‌ డా. ఇయాన్‌ లిప్‌కిన్‌

దిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ అంతరించి పోతుందని కచ్చితంగా చెప్పలేమని ప్రముఖ వైరాలజిస్ట్‌ డా. ఇయాన్‌ లిప్‌కిన్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఓ జాతీయ వార్తాసంస్థ నిర్వహించిన సదస్సులో ఇయాన్‌ లిప్‌కిన్‌ మాట్లాడారు. కరోనా ముగిసిపోయిందనే భావిస్తున్నానని పేర్కొన్న లిప్‌కిన్‌.. కానీ నమ్మకంగా చెప్పలేనని తెలిపారు. కొవిడ్‌ ఉద్భవించినప్పటి నుంచి అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉందన్నారు. కరోనా సుదీర్ఘ కాలం కొనసాగితే వైరస్‌ బాధితులు తేలికపాటి లక్షణాలను మాత్రమే కలిగి ఉండే అవకాశం ఉందన్నారు. కానీ కొందరిలో ఆలోచన శక్తి తగ్గిపోవడం, శ్వాస సరిగా ఆడకపోవడం, అలసట వంటి లక్షణాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనా తగ్గిపోయినప్పటికీ వారు ఈ లక్షణాలను కలిగి ఉంటారని వెల్లడించారు.

వైరస్‌ను పూర్తిగా నివారించేందుకు తీసుకునే చర్యలపై దృష్టిసారించాలని ఇయాన్‌ లిప్‌కిన్‌  సూచించారు. టీకాల ప్రాముఖ్యతపైనా ఆయన మాట్లాడారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించేందుకు టీకా తయారీలో భారత్‌ దూసుకుపోతోందని కొనియాడారు. మరో ఏడాదిలోగా ప్రపంచంలోని 90 శాతం మంది టీకాలు తీసుకొని ఉంటారని.. అయినప్పటికీ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాల్సిందేనన్నారు.

కొత్త ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌పై లిప్‌కిన్‌ భయాందోళన వ్యక్తం చేశారు. ‘కొత్త ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ నిరంతరం అభివృద్ధి చెందుతూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇది మమ్మల్ని మరోసారి సవాలు చేసే అవకాశం ఉంది. ఫ్లూ, హెచ్‌ఐవీ వంటి వాటి గురించి ఆందోళన చెందుతున్నా. వీటిని సులభంగా నివారించవచ్చు. వీటి నివారణకు బడ్జెట్‌ కేటాయించాలి’ అని పేర్కొన్నారు. భారత్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌ జనాభాలో పూర్తిస్థాయిలో టీకాలు తీసుకున్నవారి శాతం చాలా తక్కువగా ఉందని ఈ నేపథ్యంలో స్కూళ్లను ఇప్పుడే ప్రారంభించకూడదని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని