Parliament: 17 కేటగిరీలుగా అత్యంత కాలుష్య కారక పరిశ్రమలు

తాజా వార్తలు

Published : 09/08/2021 23:54 IST

Parliament: 17 కేటగిరీలుగా అత్యంత కాలుష్య కారక పరిశ్రమలు

దిల్లీ: అత్యంత కాలుష్య కారక పరిశ్రమలను 17 కేటగిరీలుగా విభజించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిమెంట్‌, థర్మల్‌, స్టీల్‌ప్లాంట్‌ సహా మొత్తం 17 రకాల పరిశ్రమలను అత్యంత కాలుష్య కారక పరిశ్రమలుగా విభజించినట్లు వెల్లడించింది. రాజ్యసభలో భాజపా ఎంపీ అశోక్‌ బాజ్‌పాయ్‌ కాలుష్య ప్రమాణాలపై లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. అశోక్‌ బాజ్‌పాయ్‌ అడిగిన ప్రశ్నకు పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే జవాబిచ్చారు. కాలుష్య ప్రమాణాల మేరకు వీటిని నోటిఫై చేసినట్లు పార్లమెంటుకు తెలిపారు. అత్యంత కాలుష్య కారక జాబితాలో బ్యాటరీ ఉత్పత్తి పరిశ్రమలు లేకపోవడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని