Rahul Gandhi: ఎయిమ్స్‌కు వెళ్లిన రాహుల్‌.. మన్మోహన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా!

తాజా వార్తలు

Published : 14/10/2021 21:41 IST

Rahul Gandhi: ఎయిమ్స్‌కు వెళ్లిన రాహుల్‌.. మన్మోహన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా!

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం మన్మోహన్‌కు జ్వరం రావడం.. దాన్నుంచి కోలుకున్నాక కూడా నీరసం తగ్గకపోవడంతో బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు సాయంత్రం ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన రాహుల్‌ గాంధీ.. దాదాపు అర్ధగంట పాటు అక్కడే ఉన్నారు. మన్మోహన్‌ సింగ్‌ సతీమణి గురుశరణ్‌ కౌర్‌ను కలిశారు. అలాగే, ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. మరోవైపు, మన్మోహన్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఆకాంక్షించగా.. ఈ ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని