హిమాచల్‌ ప్రదేశ్‌లో వరద బీభత్సం

తాజా వార్తలు

Published : 12/07/2021 23:00 IST

హిమాచల్‌ ప్రదేశ్‌లో వరద బీభత్సం

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ధర్మశాలలో వీధుల్లో నిలిపిన కార్లు వరదలో కొట్టుకుపోయాయి. పలుచోట్ల రహదారి పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

కాంగ్రా జిల్లాలో ఆదివారం కురిసిన వర్షం కారణంగా ధర్మశాల పరిసర ప్రాంతాల్లో నదులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉద్ధృతికి రోడ్డుపై ఉన్న కారులు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి. వరదల వల్ల మంజీనది పరిసరాల్లో సుమారు పది దుకాణ సముదాయాలు దెబ్బతిన్నాయి. పర్యాటకులు, ప్రజలు నది పరిసర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని