Quality Life: ఆ రాష్ట్రాల్లో వృద్ధులు హాయిగా ఉన్నారు..!

తాజా వార్తలు

Published : 12/08/2021 22:01 IST

Quality Life: ఆ రాష్ట్రాల్లో వృద్ధులు హాయిగా ఉన్నారు..!

దిల్లీ: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్లో వృద్ధులు నాణ్యమైన జీవితం గడుపుతున్నారని తేలింది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాంపిటీటివ్‌నెస్‌ అనే సంస్థ నివేదికను వెల్లడించింది. ఈ అంశంలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో నిలిచినట్టు తెలిపింది.  50 లక్షలకుపైగా వృద్ధులు ఉన్న రాష్ట్రాలను ఏజ్డ్‌ విభాగం, అంతకన్నా తక్కువ ఉన్న రాష్ట్రాలను రిలేటివ్‌ రీ ఏజ్డ్‌  విభాగంగా వర్గీకరించారు. ఏజ్డ్‌ కేటగిరీలో 2,3 స్థానాల్లో మహారాష్ట్ర, బిహార్‌ నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. రిలేటివ్‌ రీ ఏజ్డ్‌ జాబితాలో హిమాచల్‌ప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆర్థిక, సామాజిక స్థితులు, ఆరోగ్య వ్యవస్థ, ఆదాయ భద్రత వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని