వాట్సప్‌లో భద్రతపరమైన లోపాలు

తాజా వార్తలు

Updated : 18/04/2021 09:54 IST

వాట్సప్‌లో భద్రతపరమైన లోపాలు

సైబర్‌ సంస్థ హెచ్చరిక

దిల్లీ: విస్తృతంగా వాడకంలో ఉన్న మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సప్‌’లో భద్రతపరమైన కొన్ని ముప్పులు పొంచి ఉన్నాయని భారత సైబర్‌ భద్రతా సంస్థ ‘సెర్ట్‌-ఇన్‌’ హెచ్చరించింది. వీటివల్ల సున్నితమైన సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దీని తీవ్రత రేటింగ్‌ చాలా ‘అధికం’గా ఉందని తెలిపింది. వీ2.21.4.18 (ఆండ్రాయిడ్‌), వీ2.21.32 (ఐవోఎస్‌)కు ముందున్న వాట్సప్‌ వెర్షన్లలోని సాఫ్ట్‌వేర్‌లో ఈ ముప్పులను గుర్తించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ యాప్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్, ఐవోఎస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి వాట్సప్‌కు సంబంధించిన తాజా వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని