COVID19 infection: ఒడిశా యువతలో కొవిడ్‌ ప్రమాద ఘంటికలు..!

తాజా వార్తలు

Published : 06/09/2021 23:20 IST

COVID19 infection: ఒడిశా యువతలో కొవిడ్‌ ప్రమాద ఘంటికలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒడిశాలో పిల్లలు, యువకుల్లో కొవిడ్‌ కేసులు ఒకే రోజు 20శాతం దాటేశాయి. తాజాగా రాష్ట్రంలో నమోదైన 609 కేసుల్లో 122 మంది 18 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. అంటే మొత్తం కేసుల్లో 18ఏళ్ల లోపువారే దాదాపు 20శాతం మంది ఉన్నారు. ఆదివారం నమోదైన కేసుల్లో 16.27శాతం, శనివారం నమోదైన కేసుల్లో 17.32శాతం పిల్లలే ఉన్నారు. 

‘‘పిల్లలు, యువతలో కొవిడ్‌ వ్యాప్తి పెరుగుతోంది. ఇప్పుడు మొత్తం కేసుల్లో వారే 20.3శాతం ఉండటం ఆందోళనకరం.’’ అని ఒడిశాకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. రోజువారీ మొత్తం పరీక్షల్లో పాజిటివిటీ రేటు 0.93శాతంగా ఉంది. నిన్న మొత్తం 65,286 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్‌ సోకిన వారి సంఖ్య 10,12,167కు చేరింది. కొత్త 354 కేసులను క్వారంటైన్‌ సెంటర్లలో గుర్తించగా.. మరో 255 కేసులను కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ఆధారంగా గుర్తించారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్‌ కారణంగా మొత్తం 8,055 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని