అసభ్యత పెరిగిపోతోంది..పర్యవేక్షణ అవసరం

తాజా వార్తలు

Published : 04/03/2021 17:53 IST

అసభ్యత పెరిగిపోతోంది..పర్యవేక్షణ అవసరం

ఓటీటీల కంటెంట్‌పై సుప్రీంకోర్టు

దిల్లీ: ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫాంలలో ప్రసారమయ్యే వీడియోలపై పర్యవేక్షణ అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన విచారణలో భాగంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. ‘‘ ప్రస్తుతం ఇంటర్నెట్‌, ఓటీటీల్లో సినిమాలు, వీడియోలు చూడటం చాలా సాధారణమైపోయింది. కాబట్టి దీనిపై పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా కొన్ని ప్లాట్‌ఫాంలలో అసభ్యకరమైన కంటెంట్‌ ప్రసారమవుతోంది.’’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన కేసులో  అమెజాన్‌ ఇండియా హెడ్‌ అపర్ణా పురోహిత్‌ ముందస్తు బెయిల్‌ను అలహాబాద్ కోర్టు కొట్టేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ప్రకటించిన ఓటీటీల మార్గదర్శకాలను శుక్రవారం కోర్టుకు సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని