Sputnik V: వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి..!
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 18:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sputnik V: వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి..!

కేంద్ర ప్రభుత్వం వెల్లడి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ వ్యాక్సిన్‌ కొరత రాష్ట్రాలను వేధిస్తోంది. ఈ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా అమెరికా ఎఫ్‌డీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఏ టీకానైనా రాష్ట్రాలు దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. వీటికి ఒకటి, రెండు రోజుల్లోనే రాష్ట్రాలకు అనుమతి ఇస్తామని తెలిపింది. వ్యాక్సిన్‌ల దిగుమతి కోసం ఇప్పటివరకూ ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు ఇప్పటికే ఫైజర్‌ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ (హెల్త్‌) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ మాట్లాడుతూ.. ‘విదేశీ టీకాల దిగుమతికి ఒకట్రెండు రోజుల్లో అనుమతి మంజూరు అవుతుంది. డబ్ల్యూహెచ్‌వో, ఎఫ్‌డీఏ ఆమోదించిన టీకాల దిగుమతికి అనుమతి ఇస్తాం. టీకాల దిగుమతి కోసం ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవు. ఫైజర్‌, మోడెర్నా టీకా సంస్థలు ఎంఈఏను ఇప్పటికే సంప్రదించాయి. భారత్‌లో టీకా ఉత్పత్తికి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సిద్ధంగా ఉంది. ఇతర సంస్థలకు కొవాగ్జిన్‌ తయారీ అప్పగించాలనే డిమాండ్‌ ఉంది. ఇతర సంస్థల్లో కొవాగ్జిన్‌ ఉత్పత్తిపై భారత్‌ బయోటెక్‌తో చర్చించాం. అందుకు ఆ కంపెనీ సానుకూలంగా స్పందించింది. కొవాగ్జిన్‌ను తయారీకి బీఎస్‌ఎల్‌3 ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌ అవసరం’’ అని వివరించారు.

ఇక, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వీ టీకా వినియోగానికి భారత్‌ ఇదివరకే ఆమోదం తెలిపింది. ఇప్పటికే టీకాలు మాస్కో నుంచి హైదరాబాద్‌ చేరుకున్నాయి. తొలి విడతలో భాగంగా 1.5 లక్షల వయల్స్‌ భారత్‌కు అందాయి. భారత్‌లో స్పుత్నిక్‌-వి క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌కు చేరాయి. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తర్వాత పంపిణీ చేసేందుకు రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సిద్ధంగా ఉంచింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని