ఈ సాంకేతికతను ధరిస్తే... దుస్తులపైనే సమాచారం!

తాజా వార్తలు

Updated : 14/10/2021 10:45 IST

ఈ సాంకేతికతను ధరిస్తే... దుస్తులపైనే సమాచారం!

 ‘పాకెట్‌వ్యూ’ టెక్నాలజీ ఆవిష్కరణ

ఆంటారియో: ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా, మధ్యలో మొబైల్‌ ఫోన్‌ను చూడటం అలవాటైపోయింది చాలామందికి! ఇతరులతో మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా... వాతావరణ పరిస్థితి, సమయం వంటి ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి; ఈ-మెయిల్‌ తదితర నోటిఫికేషన్లను చూడ్డానికి, గూగుల్‌ మ్యాప్స్‌లో మార్గసూచీని అనుసరించడానికి కూడా స్మార్ట్‌ఫోన్లపైనే ఆధారపడుతున్న రోజులివి. మొబైల్‌ ఫోన్‌తో పనిలేకుండా, చేసే పనిని ఆపాల్సిన అవసరం లేకుండానే ఈ సమాచారం తెలుసుకునే సౌలభ్యముంటే? సరిగ్గా ఇదే అంశంపై పరిశోధన సాగించి, సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు... కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్‌లూ పరిశోధకులు! ‘పాకెట్‌వ్యూ’గా పిలుస్తున్న ఈ టెక్నాలజీ- మనం ధరించే దుస్తులు, ఇతర వస్త్రాలపై ఎల్‌ఈడీ కాంతుల రూపంలో సంక్షిప్త సమాచారం, నోటిఫికేషన్లను ప్రదర్శిస్తుందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న, భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే స్మార్ట్‌ పరికరాల ద్వారా ఈ సాంకేతికతను వినియోగించుకోవచ్చని చెప్పారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని