Putin: అది కరోనా కాదు..వట్టి జలుబే..!

తాజా వార్తలు

Updated : 12/10/2021 18:06 IST

Putin: అది కరోనా కాదు..వట్టి జలుబే..!

టీవీలో పలుమార్లు దగ్గుతూ కనిపించిన రష్యా అధ్యక్షుడు

మాస్కో: తాను కేవలం జలుబుతో మాత్రమే బాధపడుతున్నారని, కరోనాతో కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ప్రభుత్వాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన పలుమార్లు దగ్గుతూ కనిపించారు. అప్పుడే తనకు కరోనా లేదని చెప్పారు. 

‘మీరేం ఆందోళన చెందకండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ప్రతిరోజు కొవిడ్-19 నిర్ధారణ పరీక్షతో పాటుగా, ఇతర ఇన్ఫెక్షన్లకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది’ అంటూ తన సెక్యూరిటీ కౌన్సిల్‌తో జరిగిన సమావేశంలో పుతిన్ వెల్లడించారు.  ప్రజలంతా ఆందోళన చెందారంటూ ఎగువ సభ స్పీకర్ అనగా.. ఇబ్బందికర పరిస్థితి ఏమీ లేదని ఆయన అన్నారు. ‘మీరంతా టీకా తీసుకున్నారని తెలుసు. తిరిగి మరోసారి టీకా వేయించుకోవడం మర్చిపోవద్దు’ అని బూస్టర్ డోసును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కొద్ది రోజులు క్రితం తనకు దగ్గర్లో విధులు నిర్వర్తించే సిబ్బందిలో చాలా మందికి కరోనా సోకడంతో పుతిన్ కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కడా కూడా అనారోగ్యానికి గురైన ఛాయలు ఆయన్లో కనిపించలేదు. రెండు వారాల తర్వాత టర్కీ అధ్యక్షుడితో  సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఐసోలేషన్ తర్వాత నుంచి ఎక్కువగా వర్చువల్‌ సమావేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. రష్యాలో కొద్దికాలంగా కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటమే ఈ పరిస్థితి కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశంలో ఇప్పటివరకు 78లక్షలకు పైగా కేసులు, రెండు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని