Corona : 199 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

తాజా వార్తలు

Updated : 03/10/2021 11:29 IST

Corona : 199 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల కొత్త కేసులు కాస్త తగ్గినట్లే కనిపించినా.. మళ్లీ 20 వేలపైనే నమోదవుతున్నాయి. అంతక్రితం రోజు(24,354)తో పోల్చితే కేసులు కాస్త తగ్గాయి. మరోవైపు మరణాలు 250లోపే నమోదయ్యాయి. ఇక కేరళలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. దేశంలో నమోదైన కేసుల్లో సగానికిపైగా ఆ రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. నిన్న ఆ రాష్ట్రంలో 13,217 కేసులు.. 121 మరణాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

*గడిచిన 24 గంటల్లో దేశంలో 22,842 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

*నిన్న 244 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,48,817కి చేరింది.

* కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 25,930 మంది కరోనాను జయించగా.. ఇప్పటివరకూ 3,30,94,529 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.

*ఇక ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 199 రోజుల కనిష్ఠానికి తగ్గి 2,70,557కి చేరింది.

*ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వేసిన డోసుల సంఖ్య 90.5 కోట్లు దాటింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని