India Corona: రెండో రోజూ 20 వేల దిగువనే కేసులు

తాజా వార్తలు

Updated : 06/10/2021 10:52 IST

India Corona: రెండో రోజూ 20 వేల దిగువనే కేసులు

97.94 శాతానికి చేరిన రికవరీ రేటు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. రెండోరోజూ 20 వేల దిగువనే కొత్త కేసులు వెలుగుచూడటం ఊరటనిస్తోంది. మంగళవారం 14,09,825 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,833 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. నిన్న 24,770 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.38 కోట్లకు చేరగా.. 3.31 కోట్ల(97.94 శాతం) మంది వైరస్‌ను జయించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 

కొత్త కేసులు తగ్గడంతో క్రియాశీల కేసులు మరింత క్షీణించి 2.5 లక్షల దిగువకు పడిపోయాయి. ప్రస్తుతం 2.46 లక్షల మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 0.73 శాతానికి తగ్గింది. అయితే కేసులు తగ్గుతున్నప్పటికీ మృతుల సంఖ్యలో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. నిన్న 278 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,49,538 మంది కరోనా కాటుకు బలయ్యారని కేంద్రం తెలిపింది. దేశంలో నమోదవుతోన్న కేసులు, మరణాల్లో సగం కేరళ నుంచే వస్తున్నాయి. 

దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. నిన్న 59.48 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 92 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని