India Corona: 2.4 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

తాజా వార్తలు

Updated : 08/10/2021 10:05 IST

India Corona: 2.4 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

నాలుగున్నర లక్షలకు చేరిన మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతుండటం ఊరటనిస్తోంది. దాంతో కొవిడ్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య 205 రోజుల కనిష్ఠానికి చేరింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది.

తాజాగా 13,85,706 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 21,257 మందికి పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి. 271 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరగా.. 4,50,127 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో 2,40,221 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.71 శాతానికి తగ్గింది. రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది. నిన్న 24,963 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.32 కోట్ల(97.96 శాతం) మార్కును దాటాయి. ఇక నిన్న 50.17 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దాంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 93 కోట్లకు చేరింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని