Corona: మళ్లీ తగ్గిన కొత్త కేసులు.. ఊరటనిస్తోన్న క్రియాశీల కేసులు

తాజా వార్తలు

Updated : 09/10/2021 13:51 IST

Corona: మళ్లీ తగ్గిన కొత్త కేసులు.. ఊరటనిస్తోన్న క్రియాశీల కేసులు

97.98 శాతానికి చేరిన రికవరీ రేటు 

దిల్లీ: దేశంలో కరోనా కేసులు మరోసారి 20 వేల దిగువకు చేరాయి. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగకపోయినా.. గత కొద్దికాలంగా వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. క్రియాశీల కేసులు కూడా 206 రోజుల కనిష్ఠానికి చేరడం ఊరటనిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 

గడిచిన 24 గంటల వ్యవధిలో 12,69,291 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 19,740 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో సుమారు 1,500 మేర తగ్గుదల కనిపించింది. నిన్న 23,070 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3.39 కోట్లకు చేరగా.. అందులో 3.32 కోట్ల(97.98 శాతం) మంది వైరస్‌ను జయించారు. 

ప్రస్తుతం 2,36,643 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. కొత్త కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. ఆ రేటు 0.70 శాతానికి చేరింది. ఇక నిన్న 248 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కరోనా కాటుకు బలైన వారి సంఖ్య నాలుగున్నర లక్షల మార్కును దాటింది. కాగా, కరోనా మృతుల విషయంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణాంకాలను సవరించి కొత్తగా ఏడు వేల మరణాలు చేర్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం మృతుల సంఖ్య 26 వేలుగా ఉండగా.. ఈ సవరణతో ఆ సంఖ్య 33 వేలకు చేరనుంది. 

మరోపక్క దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. నిన్న 79.12 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 94 కోట్ల మార్కుకు చేరువైంది. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని