India Corona: పండగ ఎఫెక్ట్.. మరోసారి తగ్గిన కరోనా కేసులు 

తాజా వార్తలు

Updated : 16/10/2021 10:46 IST

India Corona: పండగ ఎఫెక్ట్.. మరోసారి తగ్గిన కరోనా కేసులు 

రెండు లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా మరోసారి కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. క్రియాశీల కేసులు 217 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

శుక్రవారం దసరా పండగ రోజు కావడంతో 9,23,003 మంది మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 15,981 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. 17,861 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. నిన్న మరో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ప్రారంభం నుంచి 3.40 కోట్ల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. అందులో 3.33కోట్ల(98.08 శాతం) మందికి పైగా కోలుకున్నారు. క్రియాశీల కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. ఆ రేటు 0.59 శాతానికి తగ్గింది. 4,51,980 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

సెలవు రోజు కావడంతో టీకా కార్యక్రమం కూడా నెమ్మదించింది. నిన్న 8.36 లక్షల మందికి టీకా అందింది. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 97,23,77,045కి చేరింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని