Parliament: లోక్‌సభ.. అరగంటలో రెండుసార్లు వాయిదా

తాజా వార్తలు

Updated : 04/08/2021 11:55 IST

Parliament: లోక్‌సభ.. అరగంటలో రెండుసార్లు వాయిదా

దిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఫోన్ల హ్యాకింగ్‌, రైతు సంబంధిత అంశాలు కుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళన, ప్రభుత్వం పట్టుదల నడుమ సభలో చర్చలకు ఆస్కారమే లేకుండా పోతోంది. బుధవారం కూడా విపక్షాలు నిరసనలకు దిగడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. 

ఈ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు తమ సీట్లలో నుంచి లేచి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రశ్నోత్తరాలు చేపట్టకుండానే స్పీకర్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఉదయం 11.30 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో మరోసారి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. పెగాసస్‌తో హ్యాకింగ్‌ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని