యూఎస్‌ క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ తాత్కాలిక మూసివేత!

తాజా వార్తలు

Published : 19/01/2021 00:10 IST

యూఎస్‌ క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ తాత్కాలిక మూసివేత!

వాషింగ్టన్‌: యూఎస్‌ క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ను సోమవారం తాత్కాలికంగా మూసివేశారు. ఈ కాంప్లెక్స్‌ సమీపంలో అగ్నిప్రమాదం జరగడంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిపై యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం ట్విటర్‌లో స్పందించింది. ‘జాగ్రత్త చర్యల్లో భాగంగా క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ మూసివేయాలని నిర్ణయించాం. ప్రజలకు ఎలాంటి ముప్పు లేదు’ అని వెల్లడించింది. యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై జనవరి 6న ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బైడెన్‌ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో భద్రతా ముప్పు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో భారీగా బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఇదీ చదవండి

పటిష్ఠ పహారాలో అమెరికా!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని