US military: సర్వీసు శునకాలను అఫ్గాన్‌లోనే వదిలి వెళ్లిన అమెరికా బలగాలు

తాజా వార్తలు

Published : 02/09/2021 01:16 IST

US military: సర్వీసు శునకాలను అఫ్గాన్‌లోనే వదిలి వెళ్లిన అమెరికా బలగాలు

కాబుల్‌: అమెరికా సైనికులు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా విడిచి వెళ్లారు. సమయం లేని కారణంగా ఇంకా 200 మంది అమెరికన్లు సహా.. దేశం వీడాలనుకున్న అఫ్గాన్ పౌరులను అమెరికా తరలించలేకపోయింది. తొందరపాటులో తమకు సేవలందించిన సర్వీసు శునకాలను కూడా అఫ్గాన్‌లోనే వదిలేసి వెళ్లారు. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు ఆగస్టు 31న పూర్తిగా వైదొలగగా.. శునకాలను అక్కడే వదిలిరావడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ జాగిలాలను ‘వెటరన్ షీప్ డాగ్స్ ఆఫ్ అమెరికా’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ అగ్రరాజ్యానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం కాబుల్ లో వాటి బాగోగుల్ని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల భారత్‌ మాత్రం అఫ్గాన్‌లో మూడేళ్ల పాటు సేవలందించిన మాయా, రూబీ, బాబీ అనే జాగిలాలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. ఇండో టిబెటన్‌ బోర్డర్ పోలీస్‌ (ఐటీబీపీ) దళాలు ఆ శునకాలను భద్రంగా భారత్‌కు చేర్చాయి. ఈ రెండు అంశాలను పోలుస్తూ.. నెటిజన్లు అమెరికా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తమ పౌరులను అమెరికాకు తరలించలేకపోవడంపై ఆ దేఅ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ స్పందించారు. అఫ్గాన్‌లో ఉండిపోయిన అమెరికా పౌరులను తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్లకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని