అమెరికాను కమ్మేసిన మంచు తుపాను!

తాజా వార్తలు

Updated : 03/02/2021 11:19 IST

అమెరికాను కమ్మేసిన మంచు తుపాను!

న్యూయార్క్: అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాలను మంచు తుపాను కమ్మేస్తోంది. ఈ ప్రభావంతో చాలా చోట్ల విమాన రాకపోకలు నిలిచిపోయాయి. న్యూయార్క్ నగరం స్తంభించిపోయింది. దీంతో వాక్సిన్ కేంద్రాలను మూసేశారు. ముఖ్యంగా న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాల్లోని చాలా ప్రాంతాల్లో 48సెం.మీ మేర మంచు కురువగా, న్యూయార్క్ నగరంలో 42సెం.మీ మేర మంచు కురిసింది. దీంతో న్యూయార్క్ నగరం, న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ తుపాను పెన్సీల్వేనియా, న్యూఇంగ్లాండ్ వైపు కదులుతోందని అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 50కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో రానున్న రోజుల్లో మంచు ప్రభావం మరింత ఎక్కువగా ఉండనున్నట్లు అంచనా వేసింది.

భారీగా కురుస్తోన్న మంచు కారణంగా ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నచోట్ల పాఠశాలలను మూసివేశారు. న్యూయార్క్ నగరంలోని దాదాపు 44 కౌంటీలలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ప్రకటించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అన్న ఆయన, తీవ్రత ఎక్కువ ఉన్న చోట్ల రోడ్లు వేస్తామని తెలిపారు. అయితే, అక్కడ తుపాను ప్రభావం తగ్గడంతో రోడ్లపై ఉన్న మంచు తొలగించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

ఇక న్యూజెర్సీలోనూ మంచు తుపాను ప్రభావంతో బస్సు, రైలు సర్వీసులను నిలిపివేశారు. భారీగా కమ్మేస్తున్న మంచు కారణంగా దాదాపు 1600 విమాన సర్వీసులు రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. మంచు తుపాను కారణంగా వాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. కనెక్టికట్, న్యూజెర్సీ, ఫిలడల్ఫియా, వాషింగ్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో వాక్సిన్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధులు ఇంటినుంచి బయటకి రాకపోవడమే మంచిదని న్యూయార్క్ మేయర్ ప్రజలకు సూచించారు. మరోవైపు భారీగా కురుస్తున్న మంచును చాలా మంది ఔత్సాహికులు ఆస్వాదిస్తున్నారు.

ఇక మంచు తుపాను పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారులతో చర్చించినట్లు అధ్యక్ష భవనం పేర్కొంది.

ఇవీ చదవండి..

మహాత్మా మన్నించు

ప్రవాస భారతీయుల కోసం సరిగమల శిక్షణAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని