పర్యాటకులు రావొచ్చు.. కానీ!

తాజా వార్తలు

Published : 17/07/2021 23:54 IST

పర్యాటకులు రావొచ్చు.. కానీ!

 కొవిడ్‌ మార్గదర్శకాలను తప్పక పాటించాలన్న హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌

దిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన శిమ్లాలో పర్యాటకులు కొవిడ్‌ నిబంధనల్ని గాలికొదిలేయడం ఇటీవల జాతీయ స్థాయిలో చర్చనీయంశమైంది. ఈ నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ ప్రజలకు పలు హెచ్చరికలు సూచనలు చేశారు. ‘‘ఇక్కడికి వచ్చే పర్యాటకులతో సహా అంతా ప్రభుత్వం విధించిన కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఇటీవలి కాలంలో శిమ్లా, ధర్మశాలలకు అత్యధికంగా సందర్శకులు తరలి రావడంతో పర్యాటక స్థలాలన్నీ కిక్కిరిసిపోయాయి. వర్షాలు భారీగా కురుస్తున్న చోట్ల ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా చూసేలా జిల్లాలోని పోలీసు శాఖ పటిష్ఠ చర్యలు తీసుకుంది. కొవిడ్‌ కారణంగా పర్యాటక రంగం, వ్యాపారాలు దెబ్బతిన్న విషయం వాస్తవమే.. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే థర్డ్‌వేవ్‌ రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ గతంలో నీతి ఆయోగ్ నీతిఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ సూచనలను పాటించాలి’’ అని కోరారు.

కొండచరియలు విరిగిపడతాయ్‌.. జాగ్రత్త!

రాబోయే మూడు నాలుగు రోజుల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు నగరాలు/పట్టణాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కార్లు వరద నీటిలో పడవల్లా కొట్టుకుపోగా.. హోటళ్లు, భవనాలు నీటిలో మునిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని