సౌదీ: అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి!

తాజా వార్తలు

Updated : 11/02/2021 10:19 IST

సౌదీ: అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి!

మంటల్లో పౌర విమానం

దుబయ్‌: సౌదీ అరేబియాలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా దాడి జరిగింది. ఈ ఘటనలో ఎయిర్‌పోర్టులో నిలిచివున్న ఓ పౌరవిమానంలో మంటలు చెలరేగినట్లు సౌదీ మీడియా వెల్లడించింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఈ ఘటనలో ఏమైనా ప్రాణనష్టం జరిగిందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు విమానాశ్రయంపై దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

యెమెన్‌కు సరిహద్దుల్లో ఉన్న అభా విమానాశ్రయంపై ఇప్పటికే హౌతీ తిరుగుబాటుదారులు పలుసార్లు క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఎంతోమంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, తాజాగా జరిగిన దాడిలో ఓ విమానం మంటలకు ఆహుతి కావడం ఇదే తొలిసారి. ఈ ఘటనలతో విమానాల ట్రాకింగ్‌ వ్యవస్థకు ఆటంకం కలగడంతో విమానాల రాకపోకలకు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

గతంలోనూ సౌదీలో ఇలాగే ఎయిర్‌పోర్టులను లక్ష్యంగా చేసుకొని హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడ్డారు. 2017లో రియాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపైనా ఇటువంటి దాడే జరిగింది. అంతేకాకుండా అక్కడి చమురు కేంద్రాలపై కూడా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ దాడులకు ఇరాన్‌ కారణమని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది. ఇదిలాఉంటే, 2015లో యెమెన్‌ రాజధానిని హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించినప్పటి నుంచి ఈ యుద్ధం నడుస్తోంది. దాదాపు ఆరు సంవత్సరాలుగా నడుస్తోన్న ఈ అంతర్యుద్ధం వల్ల యెమెన్‌ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయింది. లక్షల మంది ఆకలితో అల్లాడిపోతుండగా, ఎంతో మంది సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇవీ చదవండి..
యెమెన్‌ ప్రధాని లక్ష్యంగా బాంబు దాడి
బలగాల్ని వెనక్కి తీసుకుంటున్నాం: చైనా


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని