భారత పౌరసత్వాన్ని వదులుకున్న 6.76 లక్షల మంది
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
భారత పౌరసత్వాన్ని వదులుకున్న 6.76 లక్షల మంది

దిల్లీ: దేశంలో గడిచిన ఐదేళ్లలో 6.76 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది. 2015 నుంచి 2019 మధ్య వీరంతా తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్‌ లోక్‌సభలో వెల్లడించారు. విదేశీ వ్యవహారాలశాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. 1,24,99,395 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. 2015లో 1,41,656 మంది, 2016లో 1,44,942 మంది, 2017లో 1,27,905 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది. 2018లో 1,25,130 మంది, 2019లో 1,36,441 మంది పౌరులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

ఇవీ చదవండి...

ట్రంప్‌పై అభిశంసనకు అంగీకరించిన సెనేట్‌

స్నేహితుడిని కలవడానికి వెళ్తే.. రూ.కోటి లాటరీ!
 మరిన్ని