బైడెన్‌కు గాయం.. స్పందించిన ట్రంప్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బైడెన్‌కు గాయం.. స్పందించిన ట్రంప్‌

నెవార్క్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కాలికి స్వల్ప గాయమైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఆయన తన పెంపుడు శునకం‌తో ఆడుతున్న సమయంలో ఇది చోటుచేసుకుంది. దీంతో కాబోయే అగ్రరాజ్య అధ్యక్షుడిని కట్టుదిట్టమైన భద్రత నడుమ ‘డెలావేర్‌ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్స్‌’ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య నిపుణులు ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ తదితర  వైద్య పరీక్షలు నిర్వహించారు.

తొలుత కాలి ఎముక విరగలేదని భావించినప్పటికీ, మరింత స్పష్టత కోసం బైడెన్‌కు మరోసారి స్కానింగ్‌ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ స్కానింగ్‌ ఫలితాల్లో ఆయన పాదంలో స్వల్పంగా పగులు చోటుచేసుకున్నట్టుగా సమాచారం. 78 ఏళ్ల బైడెన్‌ కొన్ని వారాల పాటు వాకింగ్‌ బూట్‌ సహాయంతో నడవాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇదిలా ఉండగా బైడెన్‌ త్వరగా కోలుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు చేసిన ట్వీట్‌ చేసిన ట్రంప్‌.. బైడెన్‌ ఆస్పత్రిలో ఉన్నట్టుగా ఓ వీడియోను కూడా దానికి జతచేశారు.మరిన్ని