అందరూ గెలిచేవరకూ..ఖైదీలుగా ఉండాల్సిందే
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అందరూ గెలిచేవరకూ..ఖైదీలుగా ఉండాల్సిందే

కొవిడ్..మన తరంలో అతిపెద్ద సంక్షోభమన్న ఐరాస

న్యూయార్క్‌: ‘కొవిడ్‌-19 మహమ్మారి మన తరంలో అతి పెద్ద సంక్షోభం’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్త సంఘీభావానికి పిలుపునిస్తూ ప్రపంచ ఆరోగ్య సదస్సుకు సంబంధించి ఆన్‌లైన్‌ సెషన్‌ను ఆయన ప్రారంభించారు. వనరుల కొరతతో అల్లాడుతున్న పేద దేశాలకు వైద్యపరంగా సహకరించాలని అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలువురు నేతలు, నిపుణులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. 

జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్‌ స్టీన్‌మీర్ మాట్లాడుతూ..‘కొవిడ్-19 నుంచి ఎవరూ సురక్షితంగా లేరు. అందరూ ఆ మహమ్మారి నుంచి రక్షణ పొందే వరకు ఎవరూ సురక్షితమైనట్లు కాదు. వారి సరిహద్దుల్లో ఎవరైనా వైరస్‌పై విజయం సాధించినా..అన్ని దేశాలు విజయం సాధించే వరకూ.. అప్పటికే గెలుపొందిన వారు వారి పరిధిలో ఖైదీలుగా జీవించాల్సిందే’ అంటూ కొవిడ్‌పై విజయం సాధించడానికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.


మరిన్ని