టెక్సాస్‌, మేరీలాండ్‌లో ఘనంగా దీపావళి
టెక్సాస్‌, మేరీలాండ్‌లో ఘనంగా దీపావళి

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన ప్రజలు దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌, మేరీలాండ్‌ ప్రాంతాల్లోని తెలుగు వారంతా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి చిన్నాపెద్దా అంతా ఒకచోట చేరి ప్రత్యేకపూజలు చేశారు. తమ ఇళ్లను రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించి, ముంగిళ్లలో దీపాలను వెలిగించారు. సాయంత్రం బాణసంచా కాలుస్తూ పండుగ సంబరాన్ని ఆస్వాదించారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని