‘ఎన్నారైస్ ఫర్ అమరావతి’కి రూ.10 లక్షల విరాళం 
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
‘ఎన్నారైస్ ఫర్ అమరావతి’కి రూ.10 లక్షల విరాళం 

ఇంటర్నెట్‌ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న సంగతి తెలిసిందే. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో అణిచివేయాలని చూస్తున్న నేపథ్యంలో పలువురు ప్రవాసాంధ్రులు రైతులకు అండగా నిలుస్తున్నారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి కొంతమంది ప్రవాసాంధ్రులు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా తమ మద్దతు తెలుపుతున్నారు. 'ఒక రాష్ట్రం-ఒక రాజధాని' నినాదంతో ఉద్యమిస్తున్న రైతులకు తమ వంతు ఆర్థిక సాయం అందజేసేందుకు #NRIsFORAMARAVATI అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ప్రముఖ ప్రవాసాంధ్రుడు డాక్టర్ బాబురావు దొడ్డపనేని రూ.10లక్షలు విరాళమిచ్చారు. రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన బాబురావు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. స్వదేశానికి, స్వగ్రామానికి తిరిగి వచ్చే ఉద్దేశం లేకపోయినా మాతృభూమిపై ఉన్న మమకారంతో రైతులు చేస్తున్న ఉద్యమానికి తన వంతు సాయం చేశారు. తమకు బాసటగా నిలిచిన డాక్టర్ బాబురావుకు అమరావతి రాజధాని రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని