ఎన్నారైలపై  లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఎన్నారైలపై  లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం

బ్రిటన్‌ గణాంక నివేదికలో వెల్లడి

లండన్‌: బ్రిటన్‌లో ఉంటున్న భారత జాతీయుల మానసిక ఆరోగ్యంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటస్టిక్స్‌’‌ (ఓఎన్‌ఎస్‌) అధికారిక గణాంకాల విశ్లేషణ ఆధారంగా వారీ నిర్ధారణకు వచ్చారు. కొవిడ్‌-19 ఆరంభంలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు.. తాము ఆందోళనకు గురవుతున్నామని, సరిగా నిద్ర పట్టడం లేదంటూ చాలామంది మానసిక నిపుణులను, హెల్ప్‌ సెంటర్లను సంప్రదించారు. ఇలాంటి వారిలో మిగతా జాతీయుల కంటే భారతీయులే అధికంగా ఉండటం గమనార్హం.

ఆందోళనకు గురైనవారిలో 36% భారత జాతీయులు కాగా, 23% బ్రిటన్‌ తెల్లజాతీయులు, 18% ఇతర జాతులకు చెందినవారు ఉన్నారు. సంపాదన, పొదుపు, ఇతర ఆర్థిక విషయాలు వారి మానసిక ఆందోళనకు ప్రధాన కారణాలని విశ్లేషించారు. ‘‘లాక్‌డౌన్‌ తొలి రోజుల్లో అన్ని వర్గాలకూ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 58% భారతీయులు మాత్రం ఆస్తులపై ఆధారపడి నష్టం నుంచి త్వరగా కోలుకున్నారు’’ అని సస్టెయినబిలిటీ అండ్‌ ఇనీక్వాలిటీస్‌ విభాగ డిప్యూటీ డైరెక్టర్‌ గ్లెన్‌ ఎవరెట్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి

గాంధీ విగ్రహం అపవిత్రంపై అమెరికా మండిపాటు

వచ్చే 4-6 నెలల్లో కరోనా మరిత తీవ్రం.. బిల్‌ గేట్స్


మరిన్ని