అగ్రరాజ్య ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల హవా!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అగ్రరాజ్య ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల హవా!

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. 71 శాతం ఓట్లు కైవసం చేసుకుని ప్రత్యర్థి ప్రెస్టన్ నెల్సన్​పై విజయం సాధించారు.

దిల్లీలో జన్మించిన కృష్ణమూర్తి.. 2016లో ప్రతినిధుల సభకు మొదటిసారి ఎన్నికయ్యారు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదోసారి గెలుపుపై అమీ బిరా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన తన ప్రత్యర్థి బజ్‌ ప్యాటర్సన్‌ కంటే దాదాపు 30 శాతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా మూడోసారి గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన తన ప్రత్యర్థిపై 50 శాతానికి పైగా లీడ్‌లో ఉన్నారు. వాషింగ్టన్​ రాష్ట్రం నుంచి ప్రమీలా జయపాల్‌​ మూడోసారి గెలుపొందారు. వీరంతా డెమొక్రాటిక్‌ పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. మరిన్ని