‘‘జో బైడెన్‌కు హిందూ సంప్రదాయాలంటే గౌరవం’’
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
‘‘జో బైడెన్‌కు హిందూ సంప్రదాయాలంటే గౌరవం’’


ఇంటర్నెట్ డెస్క్‌ : అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో ఉన్న జో బైడెన్‌కు హిందూ సంప్రదాయాలపై ఎంతో గౌరవం ఉందని కాలిఫోర్నియాలోని హనుమాన్‌ ఆలయ ఛైర్మన్‌ చంద్రశేఖర శర్మ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శర్మ.. జో బైడెన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.‘‘ 2001లో... అమెరికా వెళ్లటంలో నాకు  సమస్యలు ఎదురయ్యాయి. వీసా రావటంలో జాప్యం జరిగింది. ఆ సమయంలో జో బైడెన్‌ ఎంతో సహకరించారు. 2003లో.. విల్మింగ్టన్‌ మహాలక్ష్మి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించాం. ఆ కార్యక్రమానికి బైడెన్‌ వచ్చారు. ఆ సమయంలో హిందూ సంప్రదాయాల గురించి ఆయన తెలుసుకున్నారు. తిలకం పెట్టుకున్నారు.’’ అని చంద్రశేఖర శర్మ వివరించారు. మరిన్ని