చివరి ఓటు లెక్కించిన తర్వాతే మా గెలుపు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చివరి ఓటు లెక్కించిన తర్వాతే మా గెలుపు

ఫలితాలపై డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌

వాషింగ్టన్‌: అధికారం అనేది ఒకరి నుంచి తీసుకునేది కాదని, దాన్ని ప్రజలే ఇవ్వాలని అంటున్నారు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌. అధ్యక్ష పీఠానికి అతి సమీపంలో ఉన్న బైడెన్‌.. ఎన్నికల ఫలితాలపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ వీడియో పోస్ట్‌ చేశారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరు అనేది ప్రజలే నిర్ణయించారని ఆనందం వ్యక్తం చేశారు. 

‘ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. మేం మెజార్టీ రాష్ట్రాల్లో విజయం సాధించామనేది స్పష్టమైంది. అయితే ఇప్పుడే మేం గెలిచామని ప్రకటించట్లేదు. చివరి ఓటు లెక్కించిన తర్వాతే మేం విజయం సాధించినట్లుగా భావిస్తాం. ప్రతి ఓటు తప్పనిసరిగా లెక్కించాల్సిందే’ అని బైడెన్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయన్న ట్రంప్‌ ఆరోపణలపై బైడెన్‌ పరోక్షంగా ఇలా స్పందించారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా మన ప్రజాస్వామ్యాన్ని మననుంచి ఎవరూ దూరం చేయలేరని బైడెన్‌ అన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అమెరికా ఎన్నో పోరాటాలు చేసిందని, ఎన్నడూ తలవంచలేదని గుర్తుచేశారు. 
ఇక అధ్యక్ష ఫలితాల్లో తాము కచ్చితమైన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే అది తన ఒక్కడి విజయం కాదని, అమెరికా ప్రజలందరి గెలుపని చెప్పుకొచ్చారు. 

ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని ట్రంప్ అనుకూల వర్గం ఆరోపిస్తోంది. ప్రతి ఓటు లెక్కించాలని డిమాండ్‌ చేస్తూ అమెరికా వ్యాప్తంగా ఆందోళనకారులు నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలు ప్రదర్శించారు. ఇక ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లతో మ్యాజిక్‌ ఫిగర్‌కు అత్యంత సమీపంలో ఉన్నారు. అటు ట్రంప్‌ 214 ఓట్లు సాధించారు. ఇంకా ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. 

ఇవీ చదవండి.. 

ట్రంప్‌ గెలవాలంటే..

ట్రంప్‌.. బైడెన్‌ గెలుపు ఎక్కడెక్కడంటేమరిన్ని