జో.. మనం సాధించాం: కమలా హారిస్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
జో.. మనం సాధించాం: కమలా హారిస్‌

బైడెన్‌తో ఫోన్‌లో విజయానందం.. వీడియో

వాషింగ్టన్‌: ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌తో కమలా హారిస్‌ ఫోన్‌లో విజయానందాన్ని పంచుకున్నారు. ‘మనం సాధించాం.. మీరు తదుపరి అధ్యక్షుడు అవుతున్నారు’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. జో బైడెన్‌ విజయం ఆమెరికన్ల ఆత్మకు సంబంధించినదని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. అమెరికాకు చేయాల్సింది ఎంతో ఉందన్నారు. ‘ఏ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఆల్‌ అమెరికన్స్‌’ అంటూ ఓ వీడియో సందేశం పోస్ట్‌ చేశారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ అమెరికాకు మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత సంతతికి చెందిన ఆఫ్రో అమెరికన్‌ మహిళ అయిన కమల.. డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్షురాలిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

అమెరికా అధ్యక్ష పీఠం బైడెన్‌దే..

ట్రంప్‌ తప్పటడుగులు ఇవేనా..?

జో-బరాక్‌.. స్నేహం గురించి తెలుసా?
మరిన్ని