ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది..

ట్రంప్‌ ఓటమిపై బైడెన్‌ వ్యాఖ్య

విల్మింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనా వైఖరి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో ఊహించటం కష్టమని.. అయితే ఆయన విజయం సాధించలేదన్న సంగతి ఆయనకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అన్నారు.

అధికారంలో ఉన్న ట్రంప్‌ ఎన్నికల అధికారులను ప్రభావితం చేయటం ద్వారా ఎన్నికల అపజయం నుంచి బయట పడేందుకు ప్రయత్నించారని బైడెన్‌ ఆరోపించారు. ఈ విధంగా ప్రజాస్వామ్య భావనకు విఘాతం కలిగించడమే కాకుండా.. అమెరికాలో ప్రజాస్వామ్య పనితీరుపై మిగిలిన  ప్రపంచానికి తప్పుడు సందేశాన్ని పంపినట్లయిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా జనవరి 20న అధికారంలోకి రానున్నది డెమొక్రాటిక్‌ పార్టీయే అన్న విషయం ట్రంప్‌నకు అర్థమయ్యే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా వెలువడ్డ  జార్జియా రీకౌంటింగ్‌ ఫలితాల్లో కూడా బైడెన్‌ విజయం సాధించారు. ఆ రాష్ట్రానికి చెందిన 16 ఎలక్ట్రోరల్‌ ఓట్లు ఆయన ఖాతాలో పడటంతో డెమొక్రాటిక్‌ పార్టీ బలం 306కి పెరిగింది.


మరిన్ని