మన రాజా చారికి..  మరో గొప్ప అవకాశం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మన రాజా చారికి..  మరో గొప్ప అవకాశం

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి రాజా చారి.. అంతరిక్ష యానంలో మరో గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బృందంలో ఒకరిగా చంద్రుడిపైకి ప్రయాణించనున్న ఆయన.. అంతకు ముందే అంతరిక్షంలో ఆరు నెలలు గడపనున్నారు. ఎలన్‌ మస్క్‌కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ తలపెట్టిన మూడో మానవ సహిత అంతరిక్ష యాత్రలో పాల్గొనేందుకు రాజా ఎన్నికయ్యారు. నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) సంయుక్తంగా నిర్వహించనున్న ‘నాసా స్పేస్‌ ఎక్స్‌ క్రూ-3 మిషన్‌’కు ఆయన కమాండర్‌గా వ్యవహరిస్తారు. ఆయనతో పాటు నాసా శాస్త్రవేత్త టామ్‌ మార్ష్‌బర్న్‌, ఈఎస్‌ఏకు చెందిన మాథ్రియాస్‌ మౌరర్‌లు కూడా ఈ మిషన్‌లో పాల్గొంటారని.. నాలుగో సభ్యుడిని తర్వాత ప్రకటిస్తామని నాసా తెలిపింది.

క్రూ-3 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరే వీరి ప్రయాణం సెప్టెంబర్‌ 2021లో ప్రారంభం కావచ్చని నాసా తెలిసింది. కాగా, రాజా చారికి ఇది తొలి అంతరిక్ష యానం కానుంది. నాసా తలపెట్టిన మానవ సహిత చంద్రగ్రహ యాత్ర ఆర్టిమిస్‌లో పాల్గొననున్న ఆయనకు ఇది ఎంతో ఉపయోగకరమని పరిశీలకులు అంటున్నారు. భద్రమైన, నమ్మకమైన, చౌకైన అంతరిక్ష యానాన్ని సుసాధ్యం చేయడమే స్పేస్‌ ఎక్స్‌ క్రూ-3 మిషన్‌ కార్యక్రమ లక్ష్యమని నాసా వెల్లడించింది.

ఇవీ చదవండి

చందమామ పైకి భారత సంతతి వ్యక్తి

హబుల్‌ 30వ జన్మదినం.. నాసా ట్వీట్‌ 


మరిన్ని