అమెరికా ఎన్నికలు: మొదలైన ఓటింగ్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికా ఎన్నికలు: మొదలైన ఓటింగ్‌

వాషింగ్టన్‌: యావత్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్‌ మొదలైంది. అక్కడి కాలమానం ప్రకారం నవంబరు 3 ఉదయం 6 గంటలకు న్యూయార్క్‌, న్యూజెర్సీ, వర్జీనియాలో పోలింగ్‌ను ప్రారంభించారు. ఓటింగ్‌ సందర్భంగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఇది ఎన్నికల రోజు: అమెరికా..! వెళ్లి ఓటెయ్యండి’ అని అభ్యర్థించారు. డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ కూడా ట్వీట్ చేశారు. మాస్క్‌లు ధరించి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలని ఓటర్లను సూచించారు. 

ఓటింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అమెరికా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా న్యూయార్క్‌లోని పలు వీధుల్లో వ్యాపారులు తమ దుకాణాలకు చెక్కలను అడ్డుపెట్టుకున్నారు. ఒకవేళ ఆందోళనలు జరిగితే తమ భవనాలు ధ్వంసం కాకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. 

కాగా.. అమెరికన్లకు ఎన్నికల రోజునే కాకుండా ముందే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. దాన్ని ఎర్లీ ఓటింగ్‌గా పిలుస్తారు. కొవిడ్‌ భయంతో ఈసారి చాలా మంది ముందస్తు ఓటింగ్‌కే వెళ్లారు. ఇప్పటికే 9.9కోట్ల మంది ఎర్లీ ఓటింగ్‌లో ఓటేశారు. 

ఇవీ చదవండి..

అమెరికా ప్రీ-పోల్స్‌ ఏమంటున్నాయి?

అమెరికాలో ఆ రెండు పార్టీలే ఎందుకు?మరిన్ని