కొత్తరకం కరోనా.. సౌదీ, కువైట్‌ ఆంక్షలు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కొత్తరకం కరోనా.. సౌదీ, కువైట్‌ ఆంక్షలు

రియాద్‌: తమ దేశంలోకి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. అత్యవసర సందర్భాల్లో తప్ప అన్ని విదేశీ విమానాలను ఒక వారం పాటు నిషేధిస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. అంతేకాకుండా జల, భూ మార్గాల ద్వారా ప్రవేశాలను కూడా సౌదీ నిషేధించింది. పరిస్థితులను బట్టి ఈ నిషేధాన్ని మరోవారం పాటు పొడగించే అవకాశముందని సౌదీ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది. బ్రిటన్‌లో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ వెల్లడించింది. 

తమ దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌, నియంత్రించలేని విధంగా వ్యాప్తిస్తోందని బ్రిటన్‌ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు యూరోపియన్‌ దేశలు బ్రిటన్‌ విమానాలపై నిషేధాజ్ఞలను జారీ చేశాయి. ఇక సౌదీ పొరుగు దేశం కువైట్‌ కూడా బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. కెనడా ప్రభుత్వం కూడా యూకేకు రాకపోకలు నిలిపివేసింది. 

ఇవీ చదవండి

చైనా కుట్ర బయటపడింది

కొత్త కరోనా.. దేశంలో అత్యవసర సమావేశం


మరిన్ని