వంగపండు మృతి పట్ల ‘తానా’ సంతాపం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వంగపండు మృతి పట్ల ‘తానా’ సంతాపం

ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు ఆకస్మిక మరణం పట్ల ‘తానా’ సంతాపం ప్రకటించింది.  ఆయన మరణం కళా రంగానికి తీరని లోటని పేర్కొంది. మే 31న ప్రారంభమైన ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’కు వంగపండు ముఖ్య అతిథిగా హాజరై తన బృందంతో అంతర్జాలంలో అద్భుతమైన పాటలు పాడి అందరిని అలరించారని తానా ప్రతినిధులు గుర్తు చేశారు. అదే ఆయన చివరి కార్యక్రమం కావడం దురదృష్టకరమని.. వంగపండు కుటుంబసభ్యులకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర తీవ్ర సంతాపం తెలియజేశారు.

2017లో ‘అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా’ తరఫున ఏలూరులో వంగపండుకు ‘జానపద కళారత్న’ అవార్డును ఇచ్చి సత్కరించినట్లు ప్రసాద్‌ తోటకూర తెలిపారు.మరిన్ని