విద్యార్థులకు తానా కార్యదర్శి ఆర్థిక సాయం
విద్యార్థులకు తానా కార్యదర్శి ఆర్థిక సాయం

విజయవాడ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి రవి పొట్లూరి తన ఉదారత చాటుకున్నారు. కరోనా వైరస్‌తో తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు సహాయం అందించారు. తన సొంత నిధులతో పాటు మిత్రుల సహకారంతో దాదాపు వంద మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. దీనిలో భాగంగా విజయవాడకు చెందిన ముగ్గురు విద్యార్థులకు నగదు అందజేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి మోహిత్‌ విజయసాయి, తొమ్మిదో తరగతి విద్యార్థి తరుణ్‌ రోహిత్‌, ఎనిమిదో తరగతి విద్యార్థి సాయి జాహ్నవిలకు రూ.57,000 ఉపకార వేతనాలను విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ అన్నిదానాల్లో విద్యాదానం గొప్పదని.. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టారంటూ రవి పొట్లూరి సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బషీర్‌, ఫణి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని